వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్
న్యూఢిల్లీ : భారత జట్టు వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలవడంతో ఒక్కసారి హెడ్ కోచ్ గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తను ఎవరి మాట వినడు. తను అనుకున్నది చేస్తాడు. తనకంటూ ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కఠినమైన శిక్షణ ఇచ్చేలా చేశాడు. దీంతో ఇండియా అద్బుత విజయాలు నమోదు చేస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో ఫామ్ లో లేక పోయినప్పటికీ కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాడు సంజు. ఈ టోర్నీలో ఏకంగా 321 రన్స్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.
క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , ఫైనల్ లో దుమ్ము రేపాడు. వరుసగా 97, 89, 89 పరుగులతో సత్తా చాటాడు. ఇదిలా ఉండగా మరో వైపు తాను ఏరికోరి ఎంపిక చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం ఆశించిన మేర రాణించలేదు. క్రికెట్ ప్రేమికులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు, అనలిస్టులు సైతం తనను తప్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ పట్టించుకోలేదు. చివరకు అభిషేక్ శర్మ ఫైనల్ లో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో గంభీర్ కు ఇప్పుడు వంద మార్కులు పడ్డాయి.






