అభ్యర్థులకు పొన్నం ఆఫర్ లెటర్స్
టీఎస్పీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించింది. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా ఫైనల్ జాబితాను వెల్లడించింది.
ఈ సందర్బంగా గత ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. తాజాగా సర్కార్ మారడం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో కొలువుల భర్తీ వేగవంతం అయ్యింది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగార్థులకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గత సర్కార్ మాయ మాటలు చెప్పిందని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. కానీ తాము వచ్చాక జాబ్స్ భర్తీపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను విడతల వారీగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
నిరుద్యోగులు మధ్యవర్తుల మాటలు వినకుండా కష్టపడి చదువుకుని జాబ్స్ తెచ్చుకోవాలని సూచించారు పొన్నం ప్రభాకర్ గౌడ్.