ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు
చెన్నై : కేరళ క్రికెట్ స్టార్ సంజు శాంసన్ సంచలనంగా మారాడు. ఇప్పటికే తను నేషనల్ హీరో అయ్యాడు. మొన్నటి దాకా తను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు. పరుగుల వరద పారించాడు. కేవలం అయిదు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు. మొత్తం భారత జట్టు తరపున ఏ ప్లేయర్ చేయని విధంగా తను 321 రన్స్ చేశాడు. టాప్ లో నిలిచాడు. మొత్తం టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు పొందాడు. ఒకానొక దశలో జట్టులో ఎంపికైనప్పటికీ తనను పక్కన పెట్టింది మేనేజ్మెంట్. దీంతో అభిషేక్ శర్మ కు అనారోగ్యం కలగడం, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలని ఆశించింది. చివరకు గత్యంతరం లేక సంజు శాంసన్ కు ఛాన్స్ ఇచ్చింది.
ఈ తరుణంలో నమీబియాతో 22 రన్స్ , జింబాబ్వే తో 24 రన్స్ చేశాడు. కీలకమైన కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఒంటి చేతితో విండీస్ పై విజయం సాధించేందుకు దోహద పడ్డాడు. తను ఒక్కడే 97 రన్స్ చేశాడు. ఆ తర్వాత సెమీఫైనల్ లో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 89 పరుగులతో సత్తా చాటాడు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ వేదికగా రెచ్చి పోయాడు. 46 బంతులు ఎదుర్కొని 7 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకు పడ్డాడు. ఇండియా విజయంలో కీ రోల్ పోషించాడు. ఇక ఈనెల 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. రాజస్తాన్ రాయల్స్ ను వీడిన శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు మారాడు. ఇవాళ తను జట్టుకు సంబంధించిన జెర్సీని ధరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.







