త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

Spread the love

త‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క సినిమా చేయ‌న‌ని చెప్పా

హైద‌రాబాద్ : న‌టి, వ‌రుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న సినీ కెరీర్ గురించి ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని అనుచిత‌, అస‌భ్య వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే క్ర‌మంలో సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ త‌రుణంలో ఓ మీడియాతో చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు సినిమా ప‌రంగా ఎదురైన అనుభ‌వం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ ద‌ర్శ‌కుడి వ్య‌వ‌హారాన్ని తెలిపారు.

తాను ఒకానొక సమయంలో ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింద‌న్నారు లావ‌ణ్య త్రిపాఠి. కానీ ఆ దర్శకుడి విషయంలో ఏదో సరిగా లేదని, నాకు అక్కడ సౌకర్యంగా అనిపించ లేదని అనిపించింద‌ని వెల్ల‌డించింది. దీంతో తాను ఆ సినిమాకు ప‌ని చేయ‌డం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాన‌ని, ముఖం మీద‌నే చెప్పాన‌ని తెలిపింది. దీంతో దీనిని త‌ట్టుకోలేక ఆ తర్వాత, వారు నా గురించి వార్తా పత్రికల్లో, మీడియాలో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు లావ‌ణ్య త్రిపాఠి.

  • Related Posts

    19న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్

    Spread the love

    Spread the loveభారీ అంచ‌నాల మ‌ధ్య రానున్న సినిమా హైద‌రాబాద్ : దమ్మున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఇక మోస్ట్ పాపుల‌ర్ హీరో గా గుర్తింపు పొందాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌ను ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా…

    ఆక‌ట్టుకుంటున్న న‌య‌న్ శోభ‌న్ రాకాస

    Spread the love

    Spread the loveఇంటిల్లిపాదిని అల‌రిం చేలా చిత్రం హైద‌రాబాద్ : ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకునేలా రాక‌స మూవీని తీశారు ద‌ర్శ‌కురాలు మాన‌స శ‌ర్మ‌. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మ‌లిచారు. దీనిని నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *