భవిష్యత్తులో కేరళకు మంచి పేరు తేవాలి
కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టు కోవడమే కాదు నేషనల్ హీరోగా మారి పోయాడు కేరళకు చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు వరుసగా 22, 24, 97, 89, 89 రన్స్ తో దుమ్ము రేపాడు. మొత్తం 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అంతే కాదు ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. ఆపై చరిత్ర సృష్టించాడు. కేరళ రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచాడు సంజు శాంసన్. ఈ సందర్భంగా కేరళ సీపీఎం పినయర్ విజయన్ ప్రభుత్వం తనను ఘనంగా సన్మానించింది.
అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ లోక్ భవన్లో సంజు శాంసన్‌ను గనంగా సత్కరించారు. గవర్నర్ సంజుకు శాలువా కప్పారు. ఆయనకు ఒక ‘కసవు ముండు’, శ్రీ పద్మనాభస్వామి విగ్రహం , సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘Playing It My Way’లను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్, సంజు శాంసన్ లు చాలా సేపు చర్చించారు. అనంతరం శాంసన్ మీడియాతో మాట్లాడాడు. తనను సత్కరించినందుకు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి మంచి పేరు తీసుకు వచ్చేలా ఆడతానని చెప్పాడు.






