కీలక వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్
కేరళ : కేరళ సూపర్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాబు. బుధవారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రశంసించాడు. ఒక కోచ్‌గా చెప్పాలంటే తను సింప్లీ సూపర్ అని పేర్కొన్నాడు. ఆయన ప్రతి ఆటగాడికీ మనస్ఫూర్తిగా అండగా నిలుస్తారని చెప్పాడు. నా క్లిష్ట సమయాల్లో గంభీర్ నాకు అండగా నిలిచిన తీరును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. గంభీర్ తో నాకు చాలా కాలంగా ఎంతో మంచి అనుబంధం ఉందన్నాడు. ఆయన నాకు ఈ విధంగా మద్దతు ఇవ్వక పోయి ఉంటే, బహుశా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నాడు.
ఇదిలా ఉండగా సంజు శాంసన్ తన 11 క్రికెట్ కెరీర్ లో ఈ ఏడాది 2026లో అరుదైన ఘనతను సాధించాడు. తను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇదే క్రమంలో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సీరీస్ కు ఎంపికయ్యాడు. ఐదు మ్యాచ్ లలో కేవలం 50 రన్స్ చేశాడు. ఇదే క్రమంలో ఐసీసీ టి20 వరల్డ్ కప్ సందర్బంగా భారత జట్టుకు ఎంపికైనా తొలుత జరిగిన నాలుగు మ్యాచ్ లకు దూరమయ్యాడు. కానీ ఓపనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురి కావడంతో ఉన్నట్టుండి నమీబియాతో, జింబాబ్వేతో ఆడాడు. కీలకమైన క్వార్టర్స్ లో విండీస్ పై 97 రన్స్ చేశాడు. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో 89 , ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో 89 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. 5 ఇన్నింగ్స్ లలో 321 రన్స్ చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.







