ఎంఎస్ ధోనీకి స‌రైన వార‌సుడు శాంస‌న్

Spread the love

మాజీ క్రికెట‌ర్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు సంజుపై

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టులో లివింగ్ లెజెండ్ గా పేరు పొందిన క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ గా పిలుచుకునే మ‌హేంద్ర సింగ్ ధోనీకి అస‌లు, సిస‌లైన వారసుడు ఎవ‌రు అనే దానిపై పెద్ద ఎత్తున క్రికెట్ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో మార్చి 28 నుంచి ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యంత జనాద‌ర‌ణ పొందిన టోర్న‌మెంట్ గా గుర్తింపు పొందింది బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్). గ‌త కొన్నేళ్లుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. త‌ను నాయ‌కుడిగా ముందుండి న‌డిపించాడు స‌ద‌రు టీమ్ ను. కానీ ఊహించ‌ని విధంగా తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు.

ఈ త‌రుణంలో ఐపీఎల్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో సంజు శాంస‌న్ టాప్ లో ఉన్నాడు. అత్య‌ధికంగా ప‌రుగులు చేయ‌డంలో త‌ను కూడా ఒక‌డు. ఇదే క్ర‌మంలో త‌న‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున క్రికెట్ జ‌ట్ల యాజ‌మాన్యాలు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాడు సంజు శాంస‌న్. త‌నను చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం ఏరికోరి తీసుకుంది . ఏకంగా రూ. 18 కోట్లు వెచ్చింది. దీంతో ధోనీ త‌న వార‌సుడు ఎవ‌ర‌నే దానిపై ఏం ఆలోచిస్తున్నాడ‌నే దానిపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం సీఎస్కేకు రుతురాజ్ ఉన్నాడు. త్వ‌ర‌లోనే శాంస‌న్ కు కెప్టెన్సీ పగ్గాలు ద‌క్కేఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

  • Related Posts

    టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

    Spread the love

    Spread the loveకెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కంటిన్యూ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జ‌ట్టును ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. త‌న సార‌థ్యంలో…

    అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    Spread the love

    Spread the love46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *