పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

Spread the love

గ‌రిక‌పాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్

అమ‌రావ‌తి : మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఎంత ప్ర‌తిభ‌, పాండిత్యం ఉన్నా వృధా అని అన్నారు. ప‌ది మందికి సాయం చేయ‌ని చేతులు ఉన్నా లేన‌ట్టేన‌ని పేర్కొన్నారు. మానవత్వం లేని పాండిత్యం వృధా అని అన్నారు. గరికపాటి గతంలో దళితుల కు , మహిళలకు జరిగిన అన్యాయాల పట్ల అవగాహన తో మాట్లాడారని గుర్తు చేశారు.

ఇదే స‌మ‌యంలో పెత్తందారీ, పితృస్వామ్య వ్యవస్థ ల తరపున క్షమాపణ కూడా చెప్పారు. అందుకే ఆయన అంటే గౌరవం ఉండేద‌న్నారు పీవీ సునీల్ కుమార్. కానీ పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మీద ఆయన మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేసింద‌న్నారు. ఎన్ని శాస్త్రాలు చదివినా తన తోటి మనిషి పట్ల , పేద పిల్లల పట్ల సానుభూతి, అవగాహనా లేకపోతే ఆ పాండిత్యం దేనికి అని ప్ర‌శ్నించారు పీవీ సునీల్ కుమార్. ఇంట్లో పిల్లలకి భోజన పెట్టలేని పేద తల్లిదండ్రులు చదువు ఎలా చెప్పిస్తారు? ఆ పిల్లల్ని పనిలో పెట్ట‌డం త‌ప్ప‌. చదువు లేకుండా ఆ పిల్లలు చాకిరీ చేస్తూ జీవితాల్ని ముగిస్తారు . కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది అంటే ఆ పిల్లలని బడికి పంపుతారని ఆ విష‌యం తెలుసు కోకుండా మాట్లాడం దారుణ‌మ‌న్నారు. త‌ప్ప‌కుండా గ‌రిక‌పాటి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

    Spread the love

    Spread the loveబీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కామెంట్స్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని అన్నారు. ఎమ్మెల్యే…

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    Spread the love

    Spread the loveహైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *