కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Spread the love

అనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం న్నారు సీఎం చంద్రబాబు . దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం రాష్ట్రంలో ఉంద‌న్నారు. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం అన్నారు. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

పారిశ్రామిక‌వేత్త‌లు కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందన్నారు. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు సీఎం. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోందన్నారు.

  • Related Posts

    మోదీ నాయ‌క‌త్వం భార‌త్ కు అగ్ర‌స్థానం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇండియా ఇప్పుడు వ‌ర‌ల్డ్ లో టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీలో జ‌రిగిన…

    రికార్డు స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం

    Spread the love

    Spread the loveఅంత‌ర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంత‌ర్జాతీయ ప‌రంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా రికార్డ్ స్థాయిలో భార‌త రూపాయి ప‌త‌నం దిశ‌గా కొన‌సాగింది. ఇక అమెరిక‌న్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *