నాలో ఇంకా ఆడే స‌త్తా ఉంది : ష‌మీ

సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పై ఆగ్ర‌హం

కోల్ క‌తా : భార‌త క్రికెట్ కు చెందిన ఆల్ రౌండ‌ర్, స్టార్ పేస‌ర్ మొహ‌హ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను మ‌రోసారి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ పై న‌ర్మ గ‌ర్భంగా కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గాయం సాకుతో అజిత్ అగార్కర్ షమీని జట్టు నుండి తొలగించినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానం మీకు గుర్తుందా?. షమీ ఇలా అన్నాడు నేను CT2025, IPL2025, దులీప్ ట్రోఫీ ఆడాను .నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. అయితే ఇదే స‌మ‌యంలో షమీ గురించి మా దగ్గర ఎలాంటి అప్‌డేట్స్ లేవు అని అగార్కర్ అన‌డం వివాదానికి దారి తీసింది.

దానికి షమీ ఇలా బదులిచ్చాడు . మీకు అప్‌డేట్ కావాలంటే మీరే అడగాలి, ఎవరూ అడగకపోతే అప్‌డేట్ ఇవ్వడం నా పని కాదన్నాడు. ఈ ప్రకటన తర్వాత, షమీ బెంగాల్ తరపున దేశీయ క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ, అజిత్ అగార్కర్ అతన్ని ఏ వన్డే , టెస్ట్ జట్టులోనూ ఎంపిక చేయలేదు . స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది భార‌త్. ఇప్పుడు, షమీ ఐపీఎల్‌లో తన సత్తా చాటుతున్నాడు. త‌న‌లో ఇంకా చేవ మిగిలే ఉంద‌ని నిరూపించాడు.

  • Related Posts

    ఆట‌గాళ్ల‌పై గౌతం గంభీర్ కు న‌మ్మ‌కం లేదు : సురేష్ రైనా

    చెన్నై : భార‌త జ‌ట్టులో వ‌రుసగా మార్పులు చోటు చేసుకోవడం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేష్ రైనా. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానంగా జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న…

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *