దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

Spread the love

సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే.

తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు.

వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ విశాల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ఉద్యమం ఉమ్మడి 13 జిల్లాలు, 100 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సుమారు 1000 కిలోమీటర్ల మేర తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సాగుతున్న ఈ యాత్రలో పాల్గొన్న సైకిల్ యాత్రికులు శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకోగా డీఎస్పీ నరసింహ మూర్తి, వన్ టౌన్ సీఐ ప్రకాశ్ కుమార్, టూ టౌన్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు కలిసి ఘన స్వాగతం అందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, యాత్రికులతో కలిసి కొంత దూరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును బలంగా నిర్మించండి, డ్రగ్స్‌ను వదిలేయండి – ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆహ్వానించండి వంటి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

  • Related Posts

    100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Spread the love

    Spread the loveజూలై 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నీటి సంర‌క్ష‌ణ అనేది ఇప్పుడు అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి…

    మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

    Spread the love

    Spread the loveప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉద్రిక్తత‌ వికారాబాద్ జిల్లా : ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగ‌ళ‌వారం పరిగి మాజీ ఎమ్మెల్యే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *