సంచలన వ్యాఖ్యలు చేసిన కె. అన్నామలై
కోయంబత్తూరు : బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకేను, కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ను ఏకి పారేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈసారి టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు విజయ్. నిశ్శబ్దంగా క్యాంపెయిన్ చేస్తూ యూత్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. విజయ్ ప్రధానంగా డీఎంకే పార్టీని, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నాడు. మరో వైపు కేంద్రాన్ని కూడా వదలడం లేదు.
ఈ సందర్భంగా డీఎంకే, టీవీకేతో పాటు అన్నాడీఎంకే , బీజేపీ ఎన్డీయే కూటమి ప్రధాన పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ప్రచారంలో బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై ప్రసంగించారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీవీకే విజయ్ ప్రభావం లేదన్నారు. ఈనెల 23న జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఎన్డీయే కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






