కోట్ల కుంభ‌కోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి

Spread the love

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ డిమాడ్

హైద‌రాబాద్ : రూ. 200 కోట్ల‌కు పైగా కొన‌సాగుతున్న డ‌బ్బులు వ‌సూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నా పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు మంగ్లీని వెన‌కేసుకు వ‌స్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ సంప‌త్ నాయ‌క్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో సింగ‌ర్ మంగ్లీ పాత్ర కీల‌క‌మ‌ని, ఆమె పాత్ర ఏమిటో తేల్చాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ మోసాలపై నిగ్గు తేల్చాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై ఉంద‌న్నారు. అధిక వడ్డీ ఆశచూపి కోట్లు వసూలు చేసిన వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ తన ఫోన్ కట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. కర్ణాటక మాజీ మంత్రి మనవడి నుంచి అందిన ₹80 లక్షల వ్యవహారంలో మంగ్లీ తమ్ముడి పాత్రపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. బెంగళూరు సమీపంలోని కోట్ల విలువైన ఆరు ఎకరాల భూమి ఎవరిదో చెప్పాలని సంపత్ నాయక్ నిలదీశారు.

  • Related Posts

    ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్ రెడ్డి ఫైర్

    Spread the love

    Spread the loveఆయ‌న‌ను చంపితే నేనే బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న రంగారెడ్డి జిల్లా : కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్…

    బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

    Spread the love

    Spread the loveఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు అమ‌రావ‌తి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *