ఫలించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు
అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం ద్వారా పాడి రైతుకి అండగా నిలచారు. ఫారం పాండ్స్ నిర్మించి రైతుకి దిగుబడి సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 375 కోట్లు కేటాయించి 21,567 గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 15,000 నీటి తొట్టెలు, 1,06,788 ఫారం పాండ్స్ నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మస్టర్ల అవకతవకలకు చెక్ పెడుతూ సాంకేతికత సాయంతో ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ తీసుకువచ్చారు. స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా పాలనలో పారదర్శకత పెరిగింది. ఈ పోర్టల్ ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయపు పన్ను నగదు రహత చెల్లింపులు జరగడమే అందుకు నిదర్శనం. అంతే కాదు 13,350 పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా తీర్చిదిద్దారు. పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 77 డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.





