తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రకటన
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ (టీజేఎస్) అధ్యక్షురాలు, మాజీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. శనివారం తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. భారీ జనం మధ్య ఆమె ఈ కీలక ప్రకటన వెల్లడించారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె చేసిన తాజా ప్రకటన కలకలం రేపుతోంది. ఒక మహిళ రాజకీయ పార్టీని స్థాపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆమె బతుకమ్మ పండుగకు శాశ్వత గుర్తింపు తీసుకు వచ్చేలా చేశారు.
హైదరాబాద్‌లో కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను ప్రారంభించారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరైన ఒక బహిరంగ సభలో ఈ ప్రకటన వెలువడింది. సభికులను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు, ఆమె సభా ప్రాంగణంలో తెలంగాణ అమరులకు, తెలంగాణ తల్లికి , ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.
కవిత అధికారికంగా పార్టీని ఆవిష్కరించడంతో, ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన పరిణామానికి నాంది పలికింది. ఇదే సమయంలో తన తండ్రి స్తాపించిన బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.





