పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కంటే ఐపీఎల్ బెట‌ర్

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డేవిడ్ వార్న‌ర్

ఆస్ట్రేలియా : వ‌ర‌ల్డ్ స్టార్ ఆసిస్ క్రికెట‌ర్, మాజీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు. అయితే దీనికంటే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ బెట‌ర్ అంటూ బాంబు పేల్చాడు. తన దారుణమైన PSL అనుభవాన్ని తీవ్రంగా విమర్శించాడు. నిజం చెప్పాలంటే నా PSL అనుభవం అస్సలు బాగోలేదని అన్నాడు. ముందుగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినా ఒకే ప్రశ్న పదే పదే వచ్చేద‌న్నాడు. IPL గొప్పదా లేక PSL గొప్పదా అని? IPLకి, PSLకి అసలు పోలికే లేదని సమాధానం చెప్పి చెప్పి నేను దాదాపు విసిగి పోయానని అన్నాడు డేవివ్ వార్న‌ర్. PSL కంటే IPL ఎంతో మెరుగైన లీగ్ అని ప్ర‌శంస‌లు కురిపించాడు ఆసిస్ క్రికెట‌ర్.

రెండవదిగా ఎటువంటి కారణం లేకుండా మ్యాచ్ సమయాలు పదే పదే మారిపోయే ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌ను నేను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని మండిప‌డ్డాడు. జెర్సీల రంగు ఊడిపోయి, బంతి రంగునే మార్చేసే పరిస్థితి అక్కడ ఉందన్నాడు. ఇక బహుమతిగా హెయిర్ డ్రైయర్ ఇవ్వడం వంటి విషయాలు అయితే వివరించడానికి కూడా వీలులేనివి అని ఏకి పారేశాడు డేవిడ్ వార్న‌ర్. నాకైతే ఇది చాలా దారుణమైన అనుభవం అని వాపోయాడు. ఇంతకు ముందు నేను ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లో ఎప్పుడూ ఆడలేదన్నాడు. దురదృష్టవశాత్తు, నా కెరీర్ చివరి దశలో నేను ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజంగా చాలా దయనీయం అంటూ వాపోయాడు.

  • Related Posts

    భువ‌నేశ్వ‌ర్ కుమార్ భ‌ళా ఢిల్లీ విల విల

    Spread the love

    Spread the love3 ఓవ‌ర్లు 5 ప‌రుగులు 3 కీల‌క‌మైన వికెట్లు న్యూఢిల్లీ : స్వంత గడ్డ‌పై అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కేవ‌లం 75 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఆలౌటైంది.…

    ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : అక్స‌ర్ ప‌టేల్

    Spread the love

    Spread the loveఆర్సీ బీ చేతిలో 9 వికెట్ల తేడాతో అప‌జ‌యం న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల భారీ తేడాతో ఓట‌మి పాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *