త్వరలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి
హైదరాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అంతే కాకుండా ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. గతంలో టీడీపీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అంతే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ గా కూడా గతంలో పని చేసిన అనుభవం తనకు ఉంది. ప్రస్తుతం ఏ పార్టీలో చేరేందుకు తాను ఇష్టపడటం లేదన్నారు. అన్ని పార్టీలు ప్రజలను పట్టించు కోవడం మానేశాయన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం హామీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు బోడ జనార్దన్.






