ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఈరోజు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేస్తున్న ఉద్యోగుల పాత్ర అభినందనీయం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం అని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ కోసం నెలకు రూ. 1,000 కోట్లు విడుదల చేస్తున్నాం అన్నారు.

పీఆర్సీ, డీఏ, హెల్త్ కార్డ్స్ వంటి కీలక అంశాలపై సమావేశంలో సానుకూలంగా చర్చించామన్నారు డిప్యూటీ సీఎం. ఈ సమస్యలన్నింటినీ క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందన్నారు.. వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించడానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *