కుటుంబంతో టీవీకే విజ‌య్ బిజీ

భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన పార్టీ

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు ఆశించిన దానికంటే భిన్నంగా వ‌చ్చాయి. 60 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో త‌మిళ‌నాట ఎంజీ రాంచంద్ర‌న్, జ‌య‌ల‌లిత త‌ర్వాత మ‌రో అగ్ర న‌టుడు టీవీకే విజ‌య్ కు త‌మిళులు ప‌ట్టం క‌ట్టారు. 234 శాస‌న స‌భ స్థానాల‌కు గాను 111 స్థానాల‌తో టీవీకే పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు విజ‌య్. ఆయ‌న‌ను అంద‌రూ త‌క్కువ అంచ‌నా వేశారు. కానీ అన్ని పార్టీల కంటే భిన్నంగా త‌ను మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. సామాన్యుల‌కే ప‌ట్టం క‌ట్టారు. అభ్య‌ర్థుల‌ను కూడా తానే ఖ‌రారు చేశారు.

విచిత్రం ఏమిటంటే త‌న వ‌ద్ద పని చేసిన డ్రైవ‌ర్ కొడుకుకు శాస‌న స‌భ టికెట్ ఇచ్చాడు. మ‌రో వైపు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చిన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది టీవీకే. ఆ పార్టీకి చెందిన వీఎస్ బాబు బంప‌ర్ మెజారిటీ సాధించి గెలుపొందారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ కు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న విజ‌యం సాధించిన వెంట‌నే ఫుల్ సెక్యూరిటీ మ‌ధ్య త‌ను త‌న ఫ్యామిలీ వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ పేరెంట్స్ ను క‌లుసుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా నిన్న‌టి దాకా గ‌డిపారు. కుటుంబీకుల‌తో ఆనంద క్ష‌ణాల‌ను పంచుకున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *