రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు స‌ర‌ఫ‌రా

Spread the love

వెల్ల‌డించిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగిందని, 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

గత ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.476.94 కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు ఇప్పటికే విడుదల చేసిందని, 2025-26 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు వివిధ పంటలపై ఆకర్షణీయమైన రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

  • Related Posts

    ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

    Spread the love

    Spread the loveకాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా మారుస్తామ‌న్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్…

    ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

    Spread the love

    Spread the loveగ‌వ‌ర్న‌ర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠ‌కు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *