అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు
ముంబై : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రికార్డ్ స్థాయిలో భారత రూపాయి పతనం దిశగా కొనసాగింది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత 12 నెలల్లో రూపాయి విలువ 83.85 నుంచి 95.40కి పడి పోయింది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు (ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్) ఖరీదైనవిగా మారి, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం ప్రధానంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరల పెంపు: బ్యారెల్ చమురు ధర దాదాపు $100కి పెరగడం మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. విదేశీ మూలధన ప్రవాహం: పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి పతనానికి కారణమైందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రూపాయి విలువ స్థిరపడాలంటే, దిగుమతులు తగ్గి, విదేశీ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.







