బండి సంజ‌య్ కొడుకును అరెస్ట్ చేస్తాం

కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితి రాజు ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ పై న‌మోదైన పోక్సో కేసు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ త‌రుణంలో డీజీపీ వివ‌ర‌ణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న సిట్ ను ఏర్పాటు చేశారు. పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి లో నమోదైన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో విచారణ లో భాగంగా పియస్ కు చేరుకున్నారు (సిట్ విచారణ అధికారిణి) కూకట్ పల్లి డిసిపి రితిరాజ్ గైక్వాడ్ .

ఎస్ హెచ్ఓ క్యాబిన్ లో డిసిపి తో పాటు ఏసిపిల మీటింగ్ అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ రోజు పోలీసుల ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. నిందితులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకొంటామని అన్నారు. తర్వలో మైనర్ భాదితురాలు స్టేట్మెంట్ రికార్డ్ సైతం నమోదు చేస్తామని డీసీపీ రితిరాజు గైక్వాడ్ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం పోక్సో కేసు న‌మోదు అయ్యాక బండి సంజ‌య్ కొడుకు ప‌రారీలో ఉన్నార‌ని , ఆయ‌న‌ను ప‌ట్టుకుని తీరుతామ‌ని అంటున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *