విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తిరుగుబాటు నేత ష‌ణ్ముగం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలాంటి స‌న్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించాయి. కానీ అనూహ్యంగా కేవ‌లం 2 ఏళ్ల కాలంలోనే , త‌క్కువ వ్య‌వ‌ధిలో 234 సీట్ల‌కు గాను 108 సీట్ల‌ను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. బుధ‌వారం స్పీక‌ర్ నేతృత్వంలో శాస‌న స‌భ‌లో బ‌ల ప‌రీక్ష చేప‌ట్టారు. ఇందులో మ్యాజిక్ ఫిగ‌ర్ కు కావాల్సిన సంఖ్య 118. కానీ అంద‌రూ ఆశ్చ‌ర్య పోయేలా విజ‌య్ కు మ‌ద్ద‌తుగా ఏకంగా 144 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేశారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఓటు వేశారు. దీంతో విశ్వాసం నెగ్గింది. సుస్థిర‌మైన ప్ర‌భుత్వానికి మార్గం సుగ‌మం అయ్యింది.

ఈ సంద‌ర్బంగా విశ్వాస ప‌రీక్ష నెగ్గిన అనంత‌రం అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఎమ్మెల్యే సీవీ ష‌ణ్ముగం మీడియాతో మాట్లాడారు. AIADMK తరపున, 25 మంది ఎమ్మెల్యేలు TVK నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు తెలిపారని చెప్పారు. TVKకి మద్దతు ఇవ్వకూడదనే తీర్మానంపై 47 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని EPS చెబుతున్న విషయం పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఆ 47 మంది ఎమ్మెల్యేలు అసలు ఎప్పుడు ఈ తీర్మానంపై సంతకాలు చేశారో చెప్పాల‌న్నారు. స్పీక‌ర్ కు స‌మ‌ర్పించిన లేఖ న‌కిలీద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    తమిళ‌నాట బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన టీవీకే విజ‌య్

    Spread the love

    Spread the loveటీవీకే పార్టీకి మ‌ద్ద‌తుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠ‌కు తెర దించుతూ టీవీకే పార్టీ విజ‌య్ శాస‌న స‌భ‌లో బుధ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాల్సి ఉండ‌గా ఏకంగా…

    త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్

    Spread the love

    Spread the loveపిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *