త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్

Spread the love

పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర జిల్లా సంఘాల నాయకులు హైదరాబాద్ గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా నివేదిక స‌మ‌ర్పించారు. రాష్ట్రంలో 16 లక్షల మంది జనాభా ఉందని న్యాయం చేయాల‌ని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి తప్పకుండా ఆదుకుంటామ‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్.

ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ , గౌరవాధ్యక్షులు డాక్టర్ లాలుకోట వెంకటాచారి , రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచార్యులు తదితరులు మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు 42 మంది ఆత్మాహుతికి పాల్పడ్డారని, గత పది సంవత్సరాల నుండి కార్పోరేట్ కల్చర్ ప్రవేశంతో వృత్తులు కొల్పోయి ఉపాధి లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు ,ఆకలి చావులకు గురైనారని వాపోయారు.

గత 60 సంవత్సరాల నుండి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాతృ సంస్థ ఇదేనని చిన్న చిల్లర సంఘాలను దూరం పెట్టాలని కోరారు. అన్ని సామాజిక వర్గాలతో పాటు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి కూడా వెంటనే పాలకమండలి ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీ రామాచారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    తమిళ‌నాట బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన టీవీకే విజ‌య్

    Spread the love

    Spread the loveటీవీకే పార్టీకి మ‌ద్ద‌తుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠ‌కు తెర దించుతూ టీవీకే పార్టీ విజ‌య్ శాస‌న స‌భ‌లో బుధ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాల్సి ఉండ‌గా ఏకంగా…

    విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తిరుగుబాటు నేత ష‌ణ్ముగం చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలాంటి స‌న్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *