బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

ఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో మాట్లాడారు. భాదితులు ఉపయోగించిన మైదా పిండి కి సంబందించి, పుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. భాదితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబందిత ఆస్పత్రుల యాజమాన్యాలతో సైతం మాట్లాడారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

భాదితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా, ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని కలెక్టర్ కు సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, భాదితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని స్ప‌ష్టం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు నివేదిక అందించాల‌ని పేర్కొన్నారు నిమ్మ‌ల రామానాయుడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు. బాధిత కుటుంబాలు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. స‌ర్కార్ పూర్తిగా అండ‌గా ఉంటుంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *