ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగతా రెండూ గెలవాలి
లక్నో : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడి పోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ లో భాగంగా టాస్ ఓడి పోయి మైదానంలోకి దిగింది ముందుగా సీఎస్కే. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది. కార్తీక్ శర్మ 70 రన్స్ చేయగా శివమ్ దూబే 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ ఇద్దరు గనుక ఆడక పోయి ఉంటే చెన్నై కేవలం 100 రన్స్ మాత్రమే చేసి ఉండేది. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ , ఇంగ్లీష్ లు ఉతికి ఆరేశారు సీఎస్కే బౌలర్లను. మార్ష్ 90 పరుగులతో విరుచుకు పడ్డాడు. ఇక ఇంగ్లీష్ 38 రన్స్ చేశాడు.
దీంతో 16.4 ఓవర్లలోనే లక్నో టార్గెట్ ను పూర్తి చేసింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీడియాతో మాట్లాడాడు. మా కంటే లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడిందంటూ కితాబు ఇచ్చాడు. మరికొన్ని పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మా వైపు ఉండేదన్నాడు. మా బౌలర్ల వైఫల్యం వల్లే ఓడి పోయామని, ఇక మిగతా రెండు మ్యాచ్ లు తమకు మరింత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందన్నాడు. లేక పోతే ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం చాలా కష్టమన్నాడు రుతురాజ్ గైక్వాడ్. మొత్తంగా లక్నో పోతూ పోతూ తమ ఆశలపై నీళ్లు చల్లిందన్నాడు.






