తెలంగాణ క్యాన్స‌ర్ అట్లాస్ నివేదిక సూప‌ర్

Spread the love

నోరి ద‌త్తాత్రేయ‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ వైద్యులు అయిన నోరి దత్తాత్రేయ ను అభినందించారు. ఈరోజు త‌న‌ను కలుసుకుని, తాను ఎంతో శ్రమించి రూపొందించిన “తెలంగాణ క్యాన్సర్ అట్లాస్”ను సమర్పించారు. ఈ సంద‌ర్బంగా చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి నివేదిక‌లు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు సీఎం. ఈ నివేదిక, అధిక క్యాన్సర్ కేసులున్న ప్రాంతాలను గుర్తించడానికి, వాటి కారణాలను పరిశోధించడానికి, క్యాన్సర్‌పై పోరాడేందుకు సహాయ పడటానికి ఉపయోగ పడుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఈ నివేదికలో అందించిన సమాచారం ఆధారంగా, అధిక క్యాన్సర్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో తాము ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రులలో క్యాన్సర్ చికిత్స అందించాలనే సూచన వ‌చ్చింద‌ని, దానిని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    Spread the love

    Spread the loveబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ…

    అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ అమరావతి : ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నుల ప్ర‌గతిపై అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *