అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

స్ప‌ష్టం చేసిన మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ

అమరావతి : ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నుల ప్ర‌గతిపై అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. రాజధాని నిర్మాణ పనులు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అధికారులు, ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థలతో పనుల పురోగతిపై చర్చించారు. ఏఏ నిర్మాణాల పురోగతి ఎంత మేరకు వచ్చిందో అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి నారాయణ. రాజధాని గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు ఇతర మౌలిక సదుపాయాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే బాగుండ‌ద‌న్నారు పొంగూరు నారాయ‌ణ‌.

LPS లేఔట్లు, రోడ్లు నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అన్నారు. కాగా ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని మంత్రి నారాయణకు వివరించే ప్ర‌య‌త్నం చేశారు ఉన్న‌తాధికారులు. స‌మీక్ష అనంత‌రం నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌న్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మంజూరు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు మార్గ నిర్దేశంలో అమ‌రావ‌తిని రాబోయే రోజుల్లో విశ్వ న‌గ‌రంగా తీర్చి దిద్దుతామ‌న్నారు నారాయ‌ణ‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *