కేజ్రీవాల్ పై షర్మిష్ట కన్నెర్ర
సీఎం బాధ్యతా రాహిత్యం
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై అరెస్ట్ అయిన ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిష్ట ముఖర్జీ. కేజ్రీవాల్ కు ఖర్మ పట్టుకుందన్నారు. ఇతరులను చులకన చేసి , తాను ఒక్కడే నిజాయితీ పరుడినంటూ పదే పదే చెప్పుకునే కేజ్రీవాల్ చివరకు తనంతకు తానుగా అడ్డంగా దొరికి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
షర్మిష్ట ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. ఇవాళ అన్నా హజారే కూడా బాధ్యత వహించాలన్నారు. ఆనాడు మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లు ఇవాళ మద్యం పాలసీని రూపొందించడం విస్తు పోయేలా చేసిందన్నారు షర్మిష్ట ముఖర్జీ. కాలం ఎవరినీ ఊరికే వదలదని అన్నారు.
విచిత్రం ఏమిటంటే షీలా దీక్షిత్ కు వ్యతిరేకంగా తన వద్ద ట్రంక్ లోడ్ కు నిండా సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికారంటూ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఇప్పటి దాకా ఒక్క ఆధారాన్ని బయట పెట్టలేక పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.