అనుకున్న‌ట్టే వేశా శాంస‌న్ వికెట్ తీశా

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బౌల‌ర్ సిరాజ్

అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ మ‌రో విజ‌యాన్ని నమోదు చేసింది. ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ ను స్వంత గ‌డ్డ అహ్మదాబాద్ వేదిక‌గా 89 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 229 ర‌న్స్ చేసింది. అనంత‌రం చెన్నై సూప‌ర్ కింగ్స్ 140 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న సంజు శాంస‌న్ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. తొలి ఓవ‌ర్ తొలి బంతికే పెవిలియ‌న్ కు పంపించాడు అద్బుత‌మైన బంతితో హైద‌రాబాద్ కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్. మ్యాచ్ అనంత‌రం త‌ను ఎలా త‌న‌ను ఔట్ చేశాడో త‌న ప్లాన్ చెప్పాడు.

శాంసన్ బ్యాటింగ్ బండారం బయట పెట్టాడు. ఆ బంతి బయటకు వెళుతుంంద‌ని తెలుసు. బ్యాట్ అంచుకు తగులుతుంది. ఎర్రమట్టి నేలపై, సంజుకు వేసే మొదటి బంతికి, డ్రైవ్‌కు బౌండరీ ఇవ్వడమే మంచిదని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఎందుకంటే, చెన్నైలో మనం ఆడిన గత మ్యాచ్‌లో చూసినట్లుగా, అతను సరిగ్గా ఆడలేక పోయాడు. అందుకే, ఈ బంతిని కొంచెం ముందుకు, కొంచెం వెడల్పుగా వేయాలని అనుకున్నాను. నేను అనుకున్నట్లే జరిగింది, నాకు వికెట్ కూడా దొరికింది అని అన్నాడు సిరాజ్.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *