ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా జరిగే గరుడసేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడ వాహనంపై స్వామి వారి దివ్య దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
ఈ మేరకు విచ్చేసే భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం. ఉత్సవాలలో భాగంగా స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.








