రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ

ఘ‌నంగా స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి : తిరుప‌తిలోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్ర‌మైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగ‌గ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). ఉత్స‌వాల‌లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే గరుడసేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడ వాహనంపై స్వామి వారి దివ్య దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.

ఈ మేర‌కు విచ్చేసే భ‌క్తుల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ జేఈవో వి.వీర‌బ్ర‌హ్మం. ఉత్స‌వాల‌లో భాగంగా స్వామి వారు హంస వాహ‌నంపై ఊరేగారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్‌, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *