సీఎం విజ‌య్ అద్బుత‌మైన లీడ‌ర్

ప్రశంసించిన శివ రాజ్ కుమార్

బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అగ్ర న‌టుడు శివ రాజ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడు సీఎంగా కొలువు తీరిన టాప్ హీరో జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సాధించిన విజ‌యం మామూలు గెలుపు కాద‌న్నాడు. త‌న వైపు దేవుడు అండ‌గా ఉన్నాడ‌ని , మంచి చేసే వారికి త‌ప్ప‌క మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నాడు. న‌టుడిగా త‌నంటే ప్రేమ ఉంద‌న్నాడు. అంతే కాదు ఎల్ల‌ప్పటికీ ప్ర‌జ‌ల గురించే ఆలోచించే విజ‌య్ లాంటి హీరో త‌మిళ‌నాడుకు ఉండ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు శివ రాజ్ కుమార్.

తాజాగా సీఎం విజ‌య్ గురించి చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం క‌లిగించాయి. అటు సినీ రంగాన్ని ఇటు రాజ‌కీయ రంగాన్ని ప్ర‌భావితం చేశాయి. ఇదే స‌మ‌యంలో సినిమా న‌టులు ఎందుకు రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. అయితే త‌న స‌హ‌చ‌ర న‌టుడు ఉపేంద్ర గురించి కూడా ప్ర‌స్తావించాడు. త‌ను ఎందుకు క‌ర్ణాట‌క‌కు సీఎం కాకూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. ఇదే క్ర‌మంలో సీఎం విజ‌య్ అత్యంత నిజాయితీ క‌లిగిన మాన‌వ‌తావాది అని ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు శివ రాజ్ కుమార్.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *