నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని ప్రజలను డైవర్ట్ చేయటానికి మహానాడులో తెలంగాణ వ్యక్తితోనే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అనిపించారని విమర్శించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడు అలా మాట్లాడడని చెప్పారు. ఇవన్నీ యాధృచ్చికంగా కాకుండా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలని కవిత చెప్పారు. రాజ్యాంగం తమకు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. మీ డిక్షనరీ లో తెలంగాణ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఫైర్ అయ్యారు.
వానకాలం వచ్చిందంటే సెక్రటేరియేట్ లోకి నీళ్లు, రాజధాని మునిగిపోవటం అనేది ఆంధ్రా ప్రజలకు అవమానమని కవిత అన్నారు. నాయకులకు ఏదైనా అయితే వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారని…కానీ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. నెల్లూరు వాళ్లు చెన్నైయ్ కి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్ కు రావాల్సిందేనా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం 80 వేల ఎకరాలు సేకరిస్తున్నారని…అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. పాలన సౌలభ్యం కోసం కొన్ని భవనాలు నిర్మించేందుకు 80 వేల ఎకరాలు ఎందుకన్నారు. ఈ విషయంలో అవసరమైతే ఆంధ్రా ప్రజల హక్కుల కోసం పోరాడుతామని కవిత చెప్పారు.





