విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

Spread the love

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి

తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద బాధితులను పరామర్శించ నున్న‌ట్లు వైసీపీ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.

  • Related Posts

    రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    Spread the love

    Spread the love10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30…

    పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్టాఫ్ ఆఫీస‌ర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియ‌మితులైన సీవీ ఆనంద్ కీల‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *