కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం బాధాక‌రం

సూర్య కుమార్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్

ముంబై : భార‌త క్రికెట్ టి20 జ‌ట్టు మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను జాతీయ మీడియా పీటీఐతో మాట్లాడారు స్కై. భారత జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించబడటంపై బాధ‌ను వ్య‌క్తం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా, మిమ్మల్ని T20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై మీకు ఏమైనా నిరాశ లేదా అసహనం ఉందా అన్న ప్ర‌శ్నకు స‌మాధ‌నం ఇచ్చారు. నిజం చెప్పాలంటే, ఇది కాస్త బాధ కలిగించింది. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు నేను ఒక్క సిరీస్ లేదా టోర్నమెంట్‌లోనూ ఓడి పోలేద‌న్నారు.

కానీ ఒక ఆటగాడిగా అన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు అన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. ఏం జరిగినా అంగీకరించక తప్పదన్నాడు. నా రాతలో ఏముందో అదే నాకు లభించిందని తెలిపారు. ఇప్పుడు నేను దీని నుంచి బయటపడి, రాబోయే రోజుల్లో ఆడే వారికి మద్దతు ఇవ్వడం , సహాయ పడటంపై దృష్టి పెట్టాలన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా అనిపించింది అని వాపోయాడు సూర్య కుమార్ యాద‌వ్. అయినప్పటికీ, ఇప్పుడు నేను దీనిని వదిలేసి నా క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు.

  • Related Posts

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    ఏపీని క్రీడా హ‌బ్ గా మార్చేందుకు స‌హ‌క‌రించండి

    అమ‌రావ‌తి : ఏపీని క్రీడా కేంద్రంగా మార్చేందుకు జై షా మద్దతు కోరారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి క్రీడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *