శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Spread the love

సాద‌ర స్వాగ‌తం ప‌లికిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌

తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఆహ్వానించగా, అర్చకులు సాంప్రదాయ బద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే రాస్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ కూడా తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించారు. కాగా నిత్యం భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు 4 కోట్ల మందికి పైగా భ‌క్త బాంధ‌వులు ద‌ర్శించుకున్నార‌ని టీటీడీ తెలిపింది. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు ఈవో ర‌విచంద్ర‌.

  • Related Posts

    వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

    Spread the love

    Spread the loveసకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి…

    టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 2,500 కోట్లు

    Spread the love

    Spread the loveఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయ‌న్న టీటీడీ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిత్యం అన్నదానం కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *