మ‌త్స్య‌కారుల‌కు ప‌రిహారం అంద‌జేస్తాం : అచ్చెన్న‌

శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ మంత్రి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో మ‌త్స్య‌కారులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇచ్చారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. శ‌నివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో ప్ర‌మాదాల‌కు గురై మ‌ర‌ణించిన 63 మంది మ‌త్స్య‌కారులకు కూట‌మి ప్ర‌భుత్వం న‌ష్ట ప‌రిహారాన్ని అంద చేయ‌డం జ‌రిగిందని చెప్పారు. అంతే కాకుండా మ‌రో 100 మంది మృతి చెందిన వారికి త్వ‌ర‌లోనే ప‌రిహారాన్ని అంద‌చేస్తామ‌న్నారు. ఆధ్వానంగా త‌యారైన మ‌త్స్య‌కారుల జీవితాల్లో పూర్వ వైభ‌వం తీసుకొస్తున్నామ‌ని పేర్కొన్నారు. వారికి కావ‌ల‌సిన మౌలిక స‌దుపాయాల‌ను న‌చ్చిన విధంగా అంద‌చేస్తామ‌ని తెలిపారు అచ్చెన్నాయుడు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్సాహంతో రూ. 4000 ఖ‌ర్చుతో ప్ర‌తి బోట్ కు శాటిలైట్ ట్రాన్స్పాండర్ ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. వీటి వల్ల చేప‌లు ఎక్క‌డ ఉన్నాయో సులువుగా తెలుసుకునేందుకు వీలు క‌లుగు తుంద‌న్నారు. అంతే కాకుండా ప్ర‌మాదాల‌ను ముందుగానే గుర్తించ వ‌చ్చ‌న్నారు. ఎన్ ఎఫ్ డీ బీ ఇన్యూరెన్స్ ప‌థ‌కంలో భాగ‌స్వామ్యం అయ్యి ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన మ‌త్స్య‌కారుల‌కు 10 ల‌క్ష‌లు ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు చేప‌డుతన్న‌ట్లు చెప్పారు. లోత‌ట్టు ప్రాంతాల‌లో జీవించే మ‌త్స్య‌కారుల‌కు అన్ని స‌దుపాయాల‌ను అంద‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు అచ్చెన్నాయుడు. సీడ్ వీడ్ క‌ల్చ‌ర్ అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇప్ప‌టికే విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో సీడ్ క‌ల్చ‌ర్ అభివృద్ధి చేసేందుకు ప‌లు కంపెనీలు ముందుకు వ‌చ్చాయని తెలిపారు.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *