సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, మోష‌న్ రాజు

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, శాస‌న మండ‌లి చైర్ ప‌ర్స‌న్ కొయ్యే మోష‌ణ్ రాజు . శ‌నివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో చైర్మ‌న్లు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలలో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువుపట్టు లాంటిదని అన్నారు స్పీక‌ర్.

సభా సమావేశాలు సంవత్సరం పొడవునా జరపటం సాధ్యం కాని పని అన్నారు అయ్య‌న్న పాత్రుడు. ఈ కమిటీలు సభ పని బారాన్ని పంచుకుంటాయని తెలిపారు. సంవత్సరం పొడవునా పని చేస్తాయన్నారు. ఈ కమిటీలన్నీ శాసనసభ , మండలి లోని ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వంటి వర్గాల సంక్షేమానికి మనం తీసుకొనే చర్యలు నైతిక బాధ్యత మాత్రమే కాదు రాజ్యాంగబద్ధమైన విధి అని పేర్కొన్నారు. అదేవిధంగా వెనుకబడిన, అసూచిత, మైనారిటీ వర్గాల అభివృద్ధి లో ,వీరి సమస్యలు పరిస్కారించటంలో ఈ కమిటీల ప్రాధాన్యత అపారమైనదని అన్నారు. కమిటీల ఏర్పాటుతో ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా చర్చించ బడతాయని స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్య స్థిరత్వానికి తోడ్పడతాయని స్పీకర్ అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *