బీసీసీఐ యాజ‌మాన్యంపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్


60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) యాజ‌మాన్యం అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా ఎంపిక చేస్తున్న ప‌ద్ద‌తిని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేకించి కొంద‌రి ఆట‌గాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం, మ‌రికొంద‌రిని కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

నేను 60 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నాను, కానీ ఇంతలా ఎప్పుడూ కోపం రాలేదన్నారు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్. ఎంత దారుణమైన కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లు అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు . పానీయాలు అందించే పనిలో ఉన్న వైభవ్, అలాగే ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినా జట్టుకు దూరంగా కూర్చోవాల్సి వస్తున్న రజత్ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఈ ఎంపికను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు స‌న్నీ. ఇదిలా ఉండ‌గా గవాస్కర్ చెప్పింది అక్షరాలా నిజం. వైభవ్, రజత్‌ల కంటే అయ్యర్, తిలక్‌లకు అవకాశం ఇవ్వడం భారత జట్టుకే నష్టం అని పేర్కొన్నారు.

  • Related Posts

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

    న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *