తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి

Spread the love

ఘ‌ణంగా కొన‌సాగుతున్న ప‌ద్మావ‌తి ఉత్స‌వాలు

తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక తెప్పోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. ఉదయం సుప్రభాతం, సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు.

సాయంత్రం ఉత్సవ మూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ లు సురేష్, రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీసీఐ యాజ‌మాన్యంపై గ‌వాస్క‌ర్ సీరియ‌స్

    Spread the love

    Spread the love60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ)…

    ప్ర‌ధాని మొహ‌ర్రం పండుగ శుభాకాంక్ష‌లు

    Spread the love

    Spread the loveఇమామ్ హుస్సేన్ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం మొహ‌ర్రం పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *