రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోష‌న‌ల్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్

ఇంగ్లండ్ : ప్ర‌పంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్ర‌మించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక తాను ఈ సుదీర్గ ప్ర‌యాణం నుంచి ఆగి పోవాల‌ని అనుకుంటున్నాన‌ని తెలిపాడు. బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కున్న ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి బెన్ స్టోక్స్ భావోద్వేగ ప్రకటన చేశాడు.

రాబోయే రెండు రోజులు మీ కెప్టెన్‌గానూ, అలాగే ఇంగ్లాండ్ తరపున ఆడే ఆటగాడిగానూ నాకు చివరి రోజులు కానున్నాయి. ఈ జట్టుతో కలిసి నేను ఎన్నో ప్రయాణాలు చేశాను, ఇప్పుడు మరో చివరి ప్రయాణం మిగిలి ఉంది. ఫలితం ఏదైనప్పటికీ, మైదానం నుండి బయటకు వచ్చే సమయానికి మీలో ప్రతి ఒక్కరూ తమ సర్వస్వం ధారపోశారని నాకు తెలియాలి. కేవలం నా కోసమే కాదు, ఈ జట్టు కోసం కూడా మీ పూర్తి శక్తిని ధారపోయండి. భావోద్వేగపరమైన విషయం పూర్తయింది కాబట్టి, ఇక పనిలో నిమగ్నమవుదాం అన్నాడు బెన్ స్టోక్స్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *