లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

రావాల‌ని కోరిన అధ‌వ అర్జున‌, తిరుమాళ‌వ‌న్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జూలై 1న త‌న నేతృత్వంలో జ‌రిగే ఈ స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా టీవీకే పార్టీ అధికార ప్ర‌తినిధి, మంత్రి అధ‌వ అర్జున ప్ర‌తి పార్టీని పాల్గొనాల‌ని స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అర్జున వీసీకే ప్రెసిడెంట్, ఎంపీ తిరు తిరుమావ‌ళ‌న్ ను క‌లిశారు. రావాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు క‌లిసి టీవీకే మిత్రపక్షాల సమావేశానికి ‘లిబరేషన్ పాంథర్స్ పార్టీ’కి ఆహ్వానించారు.

ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతూ గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్, అలాగే ప్రజా పనులు , క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానాన్ని అందించడం విశేషం. ఇదిలా ఉండ‌గా టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకుని కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని విస్తు పోయేలా చేశారు టీవీకే పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. రేపు జ‌రిగే ఈ కీల‌క స‌మావేశం లో ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క

    హైద‌రాబాద్ : సంపాదించ‌డం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాల‌ని అన్నారు మంత్రి సీత‌క్క‌. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన పింక్ ర‌న్ ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *