హైదరాబాద్ : ఆయన సినీ నిర్మాత, ఆపై వ్యాపారవేత్త. అంతకు మించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన కోసం ఏమైనా చేస్తానంటాడు. ఆ మధ్యన తెలంగాణలో ఉంటూ ఏపీలో సర్కార్ కొలువు తీరడంతో తిరుమలకు కాలి నడకన వెళ్లారు. ప్రత్యర్థుల గురించి మాట్లాడే బండ్ల గణేశ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. మనోడు శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ ఎత్తున రుణాలు తీసుకున్నాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. తనను ఏం చేస్తారనే ధీమాతో రుణాలను తిరిగి చెల్లించకుండా వచ్చాడు. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీ హిల్స్‌లోని బి. గణేష్ ఆస్తిని రూ. 8.50 కోట్లకు వేలం వేసింది. దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది.
దీంతో ఈ వేలానికి వ్యతిరేకంగా బండ్ల గణేష్ పిటిషన్ దాఖలు చేశాడు. తను దాఖలు చేసిన పిటిషన్‌పై రుణ వసూలు ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది . తిరిగి రుణ వసూలు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, తెలంగాణ హైకోర్టు రుణ వసూలు ట్రిబ్యునల్ బి. గణేష్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆస్తుల వేలం సరైన నిర్ణయమేనని పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో మనోడి ఆస్తులు వేలానికి పెట్టింది.















