తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు : టీటీడీ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు జూలై 17న శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర. దీంతో పాటు జూలై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌లో స్వామి వారి ఆల‌యంలో కీల‌క‌మైన ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని , దీని కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఆయా తేదీల‌ను భ‌క్తుల సౌకర్యార్థం వెల్ల‌డించారు. 14న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఉంటుంద‌ని, కావున 14, 17వ తేదీల‌లో రెండు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉండ‌వ‌ని తెలిపారు. ఆణివార ఆస్థానం ప్ర‌తి ఏటా నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని, ఇందు కోసం టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంద‌న్నారు ఈవో.

ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు ముద్దాడ ర‌విచంద్ర‌. ఈ నేపథ్యంలో జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించడం లేద‌ని తెలిపారు. అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం జరిగింద‌న్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సహకరించాల‌ని భ‌క్తుల‌ను కోరారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *