సేంద్రీయ వ్య‌వ‌సాయం అభివృద్దికి సోపానం

Spread the love

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్

అమ‌రావ‌తి : ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. రైతులు యూరియాను మోతాదుకు మించి వినియోగిస్తున్నార‌ని, వాటిని త‌గ్గించాల‌ని సూచించారు. ఎరువుల వినియోగం తగ్గిస్తే ప్ర‌ధాన‌మంత్రి ప్రణామ్‌ కింద నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. దీని కింద ఇచ్చే నిధులను రైతులకు చెల్లిస్తామ‌ని చెప్పారు సీఎం . ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారి హెక్టారు ఉల్లికి రూ.50 వేలు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

సోమ‌వారం జ‌రిగిన శాస‌న స‌భ‌లో ప్ర‌సంగించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే దీనిని త‌ప్ప‌కుండా వాడాల‌ని సూచించారు. రైతులు బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఫుడ్ ప్రాసెసింగ్ పైనా ప్రధానంగా దృష్టి పెట్టాం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా గరిష్టంగా ఆదాయం సాధించే అవకాశం ఉందన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *