మోహ‌న్ లాల్ పై రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు. ఈసారి ఈ జాతీయ అత్యున్న‌త పుర‌స్కారానికి ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ ను ఎంపిక చేసింది. ఢిల్లీలోని రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మోహ‌న్ లాల్ అందుకున్నారు. విశేషం ఏమిటంటే ఆయ‌న అందుకునేందుకు వెళ్ల‌గానే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌తి ఒక్క‌రు లేచి స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌న జ‌ర్నీలో 150కి పైగా సినిమాల‌లో న‌టించారు. భిన్న‌మైన పాత్ర‌లు పోషించారు.

ఈ సంద‌ర్బంగా రామ్ గోపాల్ వ‌ర్మ మోహ‌న్ లాల్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎందుకంటే త‌ను హిందీలో తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కంపెనీ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు మోహ‌న్ లాల్. ఆయ‌న పాత్ర‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. ఈ క్రెడిట్ అంతా వ‌ర్మ‌కే ద‌క్కుతుంది. బాలీవుడ్ లో త‌న సినిమాల‌తో షేక్ చేశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. దాదాసాహెబ్ ఫాల్కే గురించి నాకు పెద్దగా తెలియదు, అతను మొట్టమొదటి సినిమా తీశాడు, నేను చూడలేదు. నేను దానిని చూసిన ఎవరినీ ఎప్పుడూ కలవలేదు, కానీ నేను చూసిన మోహన్ లాల్ గురించి తెలిసిన దాని ప్రకారం, దాదాసాహెబ్ ఫాల్కేకి మోహన్ లాల్ కు అవార్డు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

  • Related Posts

    సీఈఓల‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ వైర‌ల్

    వాషింగ్ట‌న్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు అమెరికా దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాల‌జీ ప‌రంగా ఆయా టాప్ కంపెనీల‌కు చెందిన చైర్మన్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు…

    ఓరుగ‌ల్లు ఎయిర్ పోర్టుకు జ‌యశంక‌ర్ పేరు పెట్టాలి

    హైద‌రాబాద్ : తెలంగాణ విశ్లేష‌కుడు వి. ప్ర‌కాశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎవ‌రి పేరు పెట్టాల‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొంద‌రు కాక‌తీయ రాజుల పేరు పెట్టాల‌ని ప్ర‌తిపాదిస్తే మ‌రికొంద‌రు తీవ్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *