భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం : వంగ‌ల‌పూడి అనిత

Spread the love

ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ముంద‌స్తు వార్నింగ్

అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఈ మేర‌కు శుక్ర‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అంద‌జేయ‌నిపేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాలలో “మోస్తరు నుండి భారీ వర్షం” కురుస్తుందని, తీరప్రాంతంలో గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌.

సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు పొంగి పొర్లుతున్న కాలువలను దాటవద్దని లేదా చెట్ల కింద, అసురక్షిత నిర్మాణాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించింది. భారత వాతావరణ శాఖ అక్టోబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో “భారీ వర్షాలు , ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 26న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ,యానాంలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని, రాయలసీమలో మోస్త‌రు వ‌ర్షాలు వ‌స్తాయ‌ని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో కూడా 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

27న ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమలో 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. తీరప్రాంత జిల్లాల‌తో పాటు రాయలసీమలో బలమైన గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది.

  • Related Posts

    ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా అనిల్ చంద్ర

    Spread the love

    Spread the loveబాధ్య‌త‌లు స్వీక‌రించిన విశ్రాంత అధికారి విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చంద్ర పునేఠా .విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి…

    ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

    Spread the love

    Spread the loveమ‌రోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం అమెరికా : ప‌శ్చిమాషియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగ‌ళ‌వారం మ‌రోసారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *