గ్రామ పంచాయ‌తీల‌తో ఐటీ అనుసంధానం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the love

10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పంచాయ‌తీరాజ్, ర‌హదారుల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల‌ను తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేశారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి త‌ను వ‌రుస‌గా స‌మీక్ష‌లు చేప‌డుతూ వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి 10 వేలు జ‌నాభా దాటిన పంచాయ‌తీల‌ను రూర్బ‌న్ పంచాయ‌తీలుగా మారుస్తామ‌ని వెల్ల‌డించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తామ‌ని అన్నారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయని తెలిపారు. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మారుస్తామ‌న్నారు. ఈ మేర‌కు ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా కేబినెట్ స‌మావేశ‌మైంద‌ని, ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

స్వతంత్ర యూనిట్లుగా 13,351 గ్రామ పంచాయతీలు ఉంటాయ‌న్నారు. గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తామ‌న్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించిందని తెలిపారు డిప్యూటీ సీఎం. రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బందిని నియ‌మిస్తామ‌న్నారు. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveరెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి…

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    Spread the love

    Spread the loveకాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *