బానోతు అనుమానాస్పద మృతి పై ఆగ్రహం
హైదరాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల) కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోని
మియాపూర్ ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేష్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్బంగా మండిపడింది. ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్ కళ్యాణి ఎస్టీ కమిషన్ కు విచారణ జరిపించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీవ్రంగా స్పందించింది ఎస్టీ కమిషన్. అనుమానాస్పద స్థితిలో మరణించిన బానోతు నగేష్ స్వస్థలం ఖమ్మం జిలల్లా యోనెకుంట తాండా.
ఈ కేసు విచారణకు సంబంధించి తక్షణమే స్పందించాలని ఆదేశించింది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను. ఇందులో భాగంగా అక్టోబర్ 7వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఘటనపై సీరియస్ అయ్యింది. బానోతు నగేష్ మృతిపై 15 రోజుల లోపు కేసు పురోగతి, చర్యల వివరాలు సమర్పించాలని ఆదేశించింది ఎస్టీ కమిషన్. ఒకవేళ నిర్దేశించిన సమయం లోపు సమాధానం ఇవ్వక పోతే , సివిల్ కోర్టు అధికారులతో సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని సైబరాబాద్ కమిషనర్ ను హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్.






